Wednesday, April 30, 2008

మినపరొట్టి / దిబ్బ రొట్టిఇది ప్రాచీన ఆంధ్రా వంటకము అని చెప్పుకోవచ్చు. ఈ రొట్టె చేయడం చాలా శులభం మరియు ఎంతో టైం కేటాయించాలిసిన అవసరం కుడా లేదు.
మినపొప్పు - 1 కప్


బియ్యం నూక- 1.5 కప్


నూనే - 2 స్పూన్లు


ఉప్పు


 • మినపొప్పుని సుమారు 6 గంటల సేపు, బియ్యం నూకని 2 గంటల సేపు నీటిలో వేరు వేరుగా నానపెట్టుకొని వుంచుకొవాలి.


 • పప్పు నానిన తరువాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని దానిలో, ఉప్పు, నానపెట్టుకున్న నూకని నీటినుంచి వేరు చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.


 • ఒక వెడల్పాటి దలసరి కడై (ముకుడు మాదిరిగా) లో నూనే తీసుకొని పొయ్యమీద వేడి చేసి, ఈ పిండి మొత్తం దానిలో వేసి కడై కి మూతపెత్తుకొని స్టవ్ సింలో పెట్టి వుంచాలి.


 • రొట్టె ముదురు కొదుమ రంగులొకి వచ్చి, కాలిన వాసన వస్తుండగా తిరగేసి మరో పదినిమషాలు అదే మాదిరిగా మూతపెట్టి సింలో వుంచి స్టవ్ కట్టేసుకొవాలి. ఒక పదినిమషాలు మగ్గనిచ్చి ముక్కలుగా కోసుకొని చట్ని తొ తింటే బావుంటుంది.

Friday, April 25, 2008

రొయ్యలు మునకాడ కూర


3/4 కప్ తొక్క తీసి శుబ్రపరిచిన రొయ్యలు.1 కప్ మునగకాడ ముక్కలు1 పెద్ద టమాటొ (ముక్కలు గా కోసుకోవాలి)2 వుల్లిపాయ్లు (ముక్కలు గా కోసుకోవాలి)1 స్పూన్ కారం1 స్పూన్ అల్లం,వెళ్ళుల్లి ముద్ద4 పర్చి మిరపకాయలు5 లవంగాలు2 స్పూన్ దనియాల పొడి1 పెద్ద స్పూన్ నూనిఉప్పు • స్టవ్ మీద కడైలో నూనే పోసి వేడి చేసి దానిలో లవంగాలు, వుల్లిపాయముక్కలు,పర్చిమిర్చి అల్లం & వెల్లుళ్ళి ముద్ద వేసి వేగించాలి.

 • వుల్లిపాయముక్కలు వేగేక దానిలో కారం, దానియల పొడి వేసి ఒక సారి వేగనిచ్చి తరువాత మునకాడ ముక్కలు, టమటొ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగనిచ్చి దనిలో రోయ్యలు కలిపి మూత పెట్టి 5ని. మగ్గనివ్వాలి.

 • తరువాత ఉప్పు,1 కప్ నీల్లు జతచేసి మూతపెట్టి, నీరు ఇంకేవరకు వుడక నివ్వాలి.

రొయ్యలకి బదులుగా జీడి పొప్పు వేసి కూడా ఈ కూర వండుకొవచ్చు.(జీడిపొప్పుని 15 ని. నీటిలో నాన బెట్టాలి)

Tuesday, April 22, 2008

ఎగ్ దొసె


గుడ్డు - 1

దొసేపిండి -2

గరిటెలు

ఉప్పు

నూనే

మిరియాల పొడిస్టవ్ మీద పెనం వేడి చేసుకోని దాని మీదా దొసె పిండితొ దొస మదిరిగా వేసుకొని, గుడ్డు పగలగొట్టి సొన దొసే మీద వేసుకొని దొసే చుట్టూ నూనే వేసి దొస పైన మిరియాల పొడి,వుప్పు చల్లు కొవాలి. ఒక నిమషం కాలనిస్తే చాలు మీ పిల్లల లంచి బాక్స్ లోకి ఎగ్ దొసె రడీ!


దొసె పిండి తయారి విధానము:

1 కప్ మినపపప్పు కి 2 కప్లు బియ్యం కలిపి 6 గంటలు నాననిచ్చి, గ్రైండర్ లో వేసి నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలు వరకు నానబెట్టుకోవాలి.

పుధీనా బిరియాని

2 కప్ బియ్యము

1 కట్ట పుధీన

1tsp అల్లం,వెల్లుళ్ళి ముద్ద

5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు

1 కేరట్

1 భీట్రూట్

1/2 కప్ బటానీలు

1tblsp నేయ్యి

1" చెక్క

½ స్పూన్ కారం

1 పువ్వు

8 లవంగాలు

2 ఏలుకులు

1 దనియాల పోడి

2 నూనే

3 కప్ నీల్లు

ఉప్పు • లవంగాలు,పువ్వు, చెక్క కలిపి పొడి చేసుకోవాలి.

 • కెరట్ , బీట్రూట్ ముక్కలు కోసుకోవాలి.

 • బియ్యం బాగా కడుకోని పక్క న పెట్టుకొవాలి

 • పుదీన ఆకులు తుంచి కడుగి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి.

 • కుక్కర్ లొ నూనే, నెయ్యి వేసి వేడి చేసి దానిలొ ఎలుకులు ఒకసారి వెగించి తరవాత పచ్చిమిరప కాయ ముక్కలు, కేరట్, బీట్రూట్ వేసి 4 నిమషాలు వెగనిచ్చి దానిలొ అల్లం,వెల్లుళ్ళి ముద్ద,కారం,దనియాల పొడి వేసి వేగానివ్వాలి

 • తరువాత ఈ పుదీనా ముద్దను వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి.

 • ఇప్పుడు బియ్యం,ఉప్పు దానిలో వెసి ఒకసారి కలిపి, నీళ్ళు పొసి కుక్కరు మూత పెట్టుకొవాలి.

 • ఒక విజిల్ వచ్చిన తరువాత సింలో పెట్టి వుడకనివ్వాలి.

దీనిలో బూట్రుట్ వేయడం వల్ల ఆకుపచ్చ రంగు బిరియానిలో ఎరుపు రంగు ముక్కలు చాల అందంగా వుంటాయి


కొబ్బరి కేప్సికం కూర


కావలిసినవి

కేప్సికం 3

పచ్చికొబ్బరి తురుము 1/4కప్పు

ఉల్లిపాయలు 2

టొమటొ 2

అల్లం,వెల్లుళ్ళి ముద్ద 1tsp

పచ్చిమిరపకాయలు 7

గసగసాలు 2tsp

నువ్వులు 2tsp

కొత్తిమీర 1కట్ట

వంటనూనె 2tbls

ఉప్పు
తయారుచేయువిధానము:


ఉల్లిపాయలు,టమటొ,కప్సికం చిన్న ముక్కలు గా కోసుకుని పక్కన పెట్టుకోవాలిఒక కడయి పొయ్య మీద వేడిచేసుకుని దాని లో నూనె వెడిచేసి, నూనె కాగేక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వుల్లిపాయ ముక్కలు మెత్త బడేవరకు వేగించాలి. తరువాత దానిలొ అల్లం వెల్లుళ్ళి ముద్ద కూడా వేసి వేగించాలి. ఇప్పుడు ఆ మిశ్రమం లో టమటముక్కలు కూడా వేసి 3 నిముషాలు వేగనిచ్చి దానిలో కేప్సికం ముక్కలు, ఉప్పు కూడా వేసుకుని కలిపి స్టవ్ సింలో పెట్టి కడై మూతపెట్టాలి. ఇలోపుగా గసగసాలు,నువ్వులు ఒకసారి వేడి చేసుకొని పొడికొట్టాలి. (పచ్చి కొబ్బరి కి బదులుగా ఎండుకొబ్బరి వాడితే దానిని కూడా దీనితో కలిపి పొడికొట్టాలి)కేప్సికం వుడికిన తరువాత ఈ పొడిని కూడా దానిలో వేసి కలుపుకొని మరొక 5 నిమషాలు మూత పెత్తుకుని మగ్గ నిచ్చి పచ్చి కొబ్బరి కూడా వేసి కలిపి పొయ్యి మీదా నుండి దించాక కొత్తి మీర చల్లుకోవాలి. నేను ఈ కూరకు ఎరుపు ఆకుపచ్చ కేప్సికం మాత్రమే వాడెను. పసుపు రంగు కేప్సికం కూడా వుంటే మంచిది. ఈ కూర పక్షన్లకి కలర్ ఫుల్ గా బావుంటుంది

కార్నచిప్స్ చాట్కార్నచిప్స్ - 50gr

టమటో -1

ఉల్లిపాయ -1

నిమ్మరసం -1tsp

కేరట్ -1

పీచ్ -1

పెరుగు -1tsp

టమటొ సాస్


తయారు చేయు విధానము:


ఉల్లిపాయ,టమటో,పీచ్ చిన్న ముక్కలుగా కోసుకోని, కెరట్ ను కోరులాగ తురిమి,కార్న్ చిప్స్ ని చేతితో ఒకసారి నలిపి కొద్దిగా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికి నిమ్మ రసం,టమటొ సాస్ కలిపి స్పూన్ తో మిక్స్ చేసుకొంటే సరి అప్పటికి అప్పుడు ఏదైనా స్నేక్ కావలంటే ఇది 2 నిమషాలలో తయారు చెసుకోవచ్చు.