Wednesday, April 30, 2008

మినపరొట్టి / దిబ్బ రొట్టి



ఇది ప్రాచీన ఆంధ్రా వంటకము అని చెప్పుకోవచ్చు. ఈ రొట్టె చేయడం చాలా శులభం మరియు ఎంతో టైం కేటాయించాలిసిన అవసరం కుడా లేదు.




మినపొప్పు - 1 కప్


బియ్యం నూక- 1.5 కప్


నూనే - 2 స్పూన్లు


ఉప్పు






  • మినపొప్పుని సుమారు 6 గంటల సేపు, బియ్యం నూకని 2 గంటల సేపు నీటిలో వేరు వేరుగా నానపెట్టుకొని వుంచుకొవాలి.


  • పప్పు నానిన తరువాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని దానిలో, ఉప్పు, నానపెట్టుకున్న నూకని నీటినుంచి వేరు చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.


  • ఒక వెడల్పాటి దలసరి కడై (ముకుడు మాదిరిగా) లో నూనే తీసుకొని పొయ్యమీద వేడి చేసి, ఈ పిండి మొత్తం దానిలో వేసి కడై కి మూతపెత్తుకొని స్టవ్ సింలో పెట్టి వుంచాలి.


  • రొట్టె ముదురు కొదుమ రంగులొకి వచ్చి, కాలిన వాసన వస్తుండగా తిరగేసి మరో పదినిమషాలు అదే మాదిరిగా మూతపెట్టి సింలో వుంచి స్టవ్ కట్టేసుకొవాలి. ఒక పదినిమషాలు మగ్గనిచ్చి ముక్కలుగా కోసుకొని చట్ని తొ తింటే బావుంటుంది.

1 comment:

Sindhura said...

Dear Sita!!
This is Chaitra,i am vizag.
Telugulo oka blog maintain cheyyalante chala kastam anukunnanu kani meru chesede chusthunte mimmalni appreciate cheyyalani anipinchindi.
Velunnappudu okasari na blog visit cheyyandi
http://aathidhyam.blogspot.com