Tuesday, April 22, 2008

కొబ్బరి కేప్సికం కూర


కావలిసినవి

కేప్సికం 3

పచ్చికొబ్బరి తురుము 1/4కప్పు

ఉల్లిపాయలు 2

టొమటొ 2

అల్లం,వెల్లుళ్ళి ముద్ద 1tsp

పచ్చిమిరపకాయలు 7

గసగసాలు 2tsp

నువ్వులు 2tsp

కొత్తిమీర 1కట్ట

వంటనూనె 2tbls

ఉప్పు




తయారుచేయువిధానము:


ఉల్లిపాయలు,టమటొ,కప్సికం చిన్న ముక్కలు గా కోసుకుని పక్కన పెట్టుకోవాలిఒక కడయి పొయ్య మీద వేడిచేసుకుని దాని లో నూనె వెడిచేసి, నూనె కాగేక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వుల్లిపాయ ముక్కలు మెత్త బడేవరకు వేగించాలి. తరువాత దానిలొ అల్లం వెల్లుళ్ళి ముద్ద కూడా వేసి వేగించాలి. ఇప్పుడు ఆ మిశ్రమం లో టమటముక్కలు కూడా వేసి 3 నిముషాలు వేగనిచ్చి దానిలో కేప్సికం ముక్కలు, ఉప్పు కూడా వేసుకుని కలిపి స్టవ్ సింలో పెట్టి కడై మూతపెట్టాలి. ఇలోపుగా గసగసాలు,నువ్వులు ఒకసారి వేడి చేసుకొని పొడికొట్టాలి. (పచ్చి కొబ్బరి కి బదులుగా ఎండుకొబ్బరి వాడితే దానిని కూడా దీనితో కలిపి పొడికొట్టాలి)కేప్సికం వుడికిన తరువాత ఈ పొడిని కూడా దానిలో వేసి కలుపుకొని మరొక 5 నిమషాలు మూత పెత్తుకుని మగ్గ నిచ్చి పచ్చి కొబ్బరి కూడా వేసి కలిపి పొయ్యి మీదా నుండి దించాక కొత్తి మీర చల్లుకోవాలి. నేను ఈ కూరకు ఎరుపు ఆకుపచ్చ కేప్సికం మాత్రమే వాడెను. పసుపు రంగు కేప్సికం కూడా వుంటే మంచిది. ఈ కూర పక్షన్లకి కలర్ ఫుల్ గా బావుంటుంది

No comments: