
ఇది ప్రాచీన ఆంధ్రా వంటకము అని చెప్పుకోవచ్చు. ఈ రొట్టె చేయడం చాలా శులభం మరియు ఎంతో టైం కేటాయించాలిసిన అవసరం కుడా లేదు.
మినపొప్పు - 1 కప్
బియ్యం నూక- 1.5 కప్
నూనే - 2 స్పూన్లు
ఉప్పు

- మినపొప్పుని సుమారు 6 గంటల సేపు, బియ్యం నూకని 2 గంటల సేపు నీటిలో వేరు వేరుగా నానపెట్టుకొని వుంచుకొవాలి.
- పప్పు నానిన తరువాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని దానిలో, ఉప్పు, నానపెట్టుకున్న నూకని నీటినుంచి వేరు చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలపాటు నాననివ్వాలి.
- ఒక వెడల్పాటి దలసరి కడై (ముకుడు మాదిరిగా) లో నూనే తీసుకొని పొయ్యమీద వేడి చేసి, ఈ పిండి మొత్తం దానిలో వేసి కడై కి మూతపెత్తుకొని స్టవ్ సింలో పెట్టి వుంచాలి.
- రొట్టె ముదురు కొదుమ రంగులొకి వచ్చి, కాలిన వాసన వస్తుండగా తిరగేసి మరో పదినిమషాలు అదే మాదిరిగా మూతపెట్టి సింలో వుంచి స్టవ్ కట్టేసుకొవాలి. ఒక పదినిమషాలు మగ్గనిచ్చి ముక్కలుగా కోసుకొని చట్ని తొ తింటే బావుంటుంది.