నేను ఇక్కడ ఎప్పుడు పిజ్జా తిన్నా దానికి ఇండియా పిజ్జా టేస్ట్ రాదు. అందుకని స్పయిసినెస్ కోసం ఈ సారి నేను నా మిగిలిపోయిన చికెన్ కూరతో పిజ్జా తయారు చేసాను.
దీనికి కావలిసినవి:
అడుగు పిజ్జా బేస్ కోసం:
2 కపులు మైదా
దీనికి కావలిసినవి:
అడుగు పిజ్జా బేస్ కోసం:
2 కపులు మైదా
1 స్పూన్ ఈస్ట్
1 స్పూన్ ఊప్పు
గోరువెచ్చని నీల్లు
ఫిజ్జా పైబాగం కొరకు:
1/4 కప్ మిగిలిపోయిన చికెన్ కూర
1/4 కప్ మిగిలిపోయిన చికెన్ కూర
1 చిన్న వుల్లిపాయ (ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కొద్దిగా కెప్సికం ముక్కలు
200 గ్రా. ఛీస్
టమటొ సాస్
మిరియాల పొడి.
ఈస్ట్ ని నీల్లలో కలిపి మూత పెట్టి 15ని. పాటు వుంచాలి.
తరువాత దీనికి మైదా,ఊప్పు చేర్చి పూరిపిండి మాదిరిగ కలిపి ఒక గంట పాటు మూత పెట్టి నాన నివ్వాలి. తరువాత ఈ పిండి రెంట్టింపు కావడం మనం గమనించవచ్చు.
ఒవెన్ ని 170 డి.సె. లో పెట్టి అన్ చేసుకోవాలి.
ఇలోపు నానబెట్టిన పిండిని చపాతి కర్ర సాయం తో కొంచం మందం గా, వెడల్పు గా చేసుకుని ఒవెన్ లో పెట్టి 10ని. వుంచాలి.
ఇలోపు చికెన్ కూర లొ చికెన్ ముక్కలని పొర్క్ సాయం తో చిన్న ముక్కలు గా చేసుకోవాలి. తరువాత ఒవెన్ నుండి పిజ్జ బేస్ బయటకి తీసి , దానిపై టమటొ సాస్ రాసి చికెన్ కూర స్ప్రెడ్ చేసి, దానిపైన చీస్ చల్లు కొని, వుల్లిపాయ ముక్కలు, కెప్సికం ముక్కలు వేసి, మిరియల పొడి కొద్దిగా చల్లు కొని తిరిగి ఒవెన్ లో పెట్టి 5 నుండి 10 నిముషాలు పాటు వుంచి చీస్ మాడకుండా బయటకి తీసేయాలి.