కావలిసినవి:
బెంగుళూర్ వంకాయలు - 3
ఉల్లిపాయ - 1
పర్చిమిర్చి - 5
దనియాల పొడి - 1 స్పూన్
మంచినూని - 1 పెద్ద స్పూన్
ఉప్పు
పసుపు
తాళింపుకి:
జీలకర్ర,ఆవాలు,మినప పప్పు, శనగపప్పు, ఎండిమిరపకాయ, కరివేపాకు.
- ఉల్లిపాయ,పర్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- బెంగుళూర్ వంకాయ తొక్క చెక్కి,రెండు బాగలు గా చేసుకొని దానిలో గింజ తొలగించి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలని కొంచం ఉప్పు వెసి చేతితో మెత్తగా నలిపి, ముక్కల నుండి నీరు తీసివేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడై లో నూనె పోసుకొని స్టవ్ మీద వేడి చేసి దానిలో తాళింపు సరుకులు వేసి, అవి వేగేక ఉల్లిపాయ, పర్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
- ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేక బెంగుళూర్ వంకాయ ముక్కలు వేసి కలిపి 5ని. మూతపెట్టి వుంచాలి.
- ఇప్పుడు దనియాల పొడి, పసుపు ఉప్పు వేసి బగా కలిపి మూత పెట్టి, స్టవ్ సింలో పెట్టి వుడకనిస్తే చాలు. నీరు కలపనవసరం లేదు.

No comments:
Post a Comment