Tuesday, April 22, 2008

పుధీనా బిరియాని

2 కప్ బియ్యము

1 కట్ట పుధీన

1tsp అల్లం,వెల్లుళ్ళి ముద్ద

5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు

1 కేరట్

1 భీట్రూట్

1/2 కప్ బటానీలు

1tblsp నేయ్యి

1" చెక్క

½ స్పూన్ కారం

1 పువ్వు

8 లవంగాలు

2 ఏలుకులు

1 దనియాల పోడి

2 నూనే

3 కప్ నీల్లు

ఉప్పు



  • లవంగాలు,పువ్వు, చెక్క కలిపి పొడి చేసుకోవాలి.

  • కెరట్ , బీట్రూట్ ముక్కలు కోసుకోవాలి.

  • బియ్యం బాగా కడుకోని పక్క న పెట్టుకొవాలి

  • పుదీన ఆకులు తుంచి కడుగి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి.

  • కుక్కర్ లొ నూనే, నెయ్యి వేసి వేడి చేసి దానిలొ ఎలుకులు ఒకసారి వెగించి తరవాత పచ్చిమిరప కాయ ముక్కలు, కేరట్, బీట్రూట్ వేసి 4 నిమషాలు వెగనిచ్చి దానిలొ అల్లం,వెల్లుళ్ళి ముద్ద,కారం,దనియాల పొడి వేసి వేగానివ్వాలి

  • తరువాత ఈ పుదీనా ముద్దను వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి.

  • ఇప్పుడు బియ్యం,ఉప్పు దానిలో వెసి ఒకసారి కలిపి, నీళ్ళు పొసి కుక్కరు మూత పెట్టుకొవాలి.

  • ఒక విజిల్ వచ్చిన తరువాత సింలో పెట్టి వుడకనివ్వాలి.

దీనిలో బూట్రుట్ వేయడం వల్ల ఆకుపచ్చ రంగు బిరియానిలో ఎరుపు రంగు ముక్కలు చాల అందంగా వుంటాయి


కొబ్బరి కేప్సికం కూర


కావలిసినవి

కేప్సికం 3

పచ్చికొబ్బరి తురుము 1/4కప్పు

ఉల్లిపాయలు 2

టొమటొ 2

అల్లం,వెల్లుళ్ళి ముద్ద 1tsp

పచ్చిమిరపకాయలు 7

గసగసాలు 2tsp

నువ్వులు 2tsp

కొత్తిమీర 1కట్ట

వంటనూనె 2tbls

ఉప్పు




తయారుచేయువిధానము:


ఉల్లిపాయలు,టమటొ,కప్సికం చిన్న ముక్కలు గా కోసుకుని పక్కన పెట్టుకోవాలిఒక కడయి పొయ్య మీద వేడిచేసుకుని దాని లో నూనె వెడిచేసి, నూనె కాగేక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వుల్లిపాయ ముక్కలు మెత్త బడేవరకు వేగించాలి. తరువాత దానిలొ అల్లం వెల్లుళ్ళి ముద్ద కూడా వేసి వేగించాలి. ఇప్పుడు ఆ మిశ్రమం లో టమటముక్కలు కూడా వేసి 3 నిముషాలు వేగనిచ్చి దానిలో కేప్సికం ముక్కలు, ఉప్పు కూడా వేసుకుని కలిపి స్టవ్ సింలో పెట్టి కడై మూతపెట్టాలి. ఇలోపుగా గసగసాలు,నువ్వులు ఒకసారి వేడి చేసుకొని పొడికొట్టాలి. (పచ్చి కొబ్బరి కి బదులుగా ఎండుకొబ్బరి వాడితే దానిని కూడా దీనితో కలిపి పొడికొట్టాలి)కేప్సికం వుడికిన తరువాత ఈ పొడిని కూడా దానిలో వేసి కలుపుకొని మరొక 5 నిమషాలు మూత పెత్తుకుని మగ్గ నిచ్చి పచ్చి కొబ్బరి కూడా వేసి కలిపి పొయ్యి మీదా నుండి దించాక కొత్తి మీర చల్లుకోవాలి. నేను ఈ కూరకు ఎరుపు ఆకుపచ్చ కేప్సికం మాత్రమే వాడెను. పసుపు రంగు కేప్సికం కూడా వుంటే మంచిది. ఈ కూర పక్షన్లకి కలర్ ఫుల్ గా బావుంటుంది

కార్నచిప్స్ చాట్



కార్నచిప్స్ - 50gr

టమటో -1

ఉల్లిపాయ -1

నిమ్మరసం -1tsp

కేరట్ -1

పీచ్ -1

పెరుగు -1tsp

టమటొ సాస్


తయారు చేయు విధానము:


ఉల్లిపాయ,టమటో,పీచ్ చిన్న ముక్కలుగా కోసుకోని, కెరట్ ను కోరులాగ తురిమి,కార్న్ చిప్స్ ని చేతితో ఒకసారి నలిపి కొద్దిగా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికి నిమ్మ రసం,టమటొ సాస్ కలిపి స్పూన్ తో మిక్స్ చేసుకొంటే సరి అప్పటికి అప్పుడు ఏదైనా స్నేక్ కావలంటే ఇది 2 నిమషాలలో తయారు చెసుకోవచ్చు.